యాదగిరిగుట్టలో ఉద్యమకారుల ఫోరం సదస్సుకు రామన్నపేట నేతల హాజరు
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం నాడు నిర్వహించిన ఉద్యమకారుల ఫోరం తొమ్మిదవ రాష్ట్ర ఆవిర్భావ సదస్సుకు రామన్నపేట మండల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సదస్సు అనంతరం వారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసును కలిసి, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రభుత్వపరంగా తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు.