రేపు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు మండాడి సినిమా

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన 'మండాడి' సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. బోట్ సీక్వెన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని, జీవీ ప్రకాష్ నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.