ఇందుకూరుపేటలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు: సేవలను విస్తరించడమే లక్ష్యమని సీడీపీవో వెల్లడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఇందుకూరుపేట
ఇందుకూరు ప్రాజెక్ట్ ఆఫీసు వద్ద మండలస్థాయిలో అంగన్వాడీ ఉత్సవం మరియు పోషణ మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీడీపీవో లక్ష్మీదేవి తెలిపారు. అంగన్వాడీల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సేవా సంకల్ప అభియాన్ పేరుతో సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఏడు వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలోనూ మూడు రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్యం, పోషణపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.