అఫ్గానిస్తాన్ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ ఊరట

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టుకు గుడ్ న్యూస్ అదంది. స్టార్ ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పరీక్షలు పూర్తి చేసుకున్న వీరిద్దరూ త్వరలో జట్టుతో కలవనున్నారు. ఇది భారత శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.