అంతర్జాతీయ విద్యార్థుల వీసాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఆస్ట్రేలియా

అంతర్జాతీయ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని రాకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలను ప్రకటించింది. హోమ్ అఫైర్స్ మంత్రి టోనీ బార్క్ సెప్టెంబర్ 17న కొత్త వలస సంస్కరణల ప్యాకేజీని వెల్లడించారు. దీని ప్రకారం చాలా వరకు స్టూడెంట్ వీసాలపై సెకండరీ దరఖాస్తుదారులను పరిమితం చేయనున్నారు. తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాదారులు తమ భాగస్వాములు, పిల్లలను ఆటోమేటిక్‌గా దేశంలోకి తీసుకురావడాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిలిపివేసింది.