తిరుపతి నుంచి తెలుగు రాష్ట్రాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుపతి

తిరుపతి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు ఫ్లై91 విమాన సంస్థ నూతన సర్వీసులను ప్రారంభించింది. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం నగరాలకు కల్పించిన ఈ ప్రత్యక్ష అనుసంధాన సేవలు శ్రీవారి భక్తులకు, ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గన్నవరం, రేణిగుంట విమానాశ్రయాల్లో తొలి సర్వీసుకు ఘన స్వాగతం లభించింది.