తీవ్ర విషాదం: అమెరికాలో చికిత్స పొందుతూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ పోలీస్, పాలనా విభాగాల్లో తీవ్ర విషాదం నెలకొందని, ఏపీఎస్ఆర్టీసీ మాజీ ఎండీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం అమెరికాలోని న్యూయార్క్లో కన్నుమూశారని అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.