సోషల్ మీడియాలో నాపై వస్తున్న ప్రచారం అవాస్తవం అంటూ షర్మిల ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం పూర్తి నిరాధారమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కుమార్తె వివాహ ఆహ్వానానికి, రాజకీయాలకు ముడిపెట్టి తన విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆమె మంగళవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలను కేవలం పెళ్లికి ఆహ్వానిస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని తేల్చిచెప్పారు.