సీతారామపురంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ప్రత్యేక అవగాహన సదస్సు

రిపోర్టర్: SYAM స్థలం: సీతారామపురం

సీతారామపురం ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సరఫరా అంతరాయాలు, మీటర్ల సమస్యలు మరియు వ్యవసాయ విద్యుత్ ఇబ్బట్లపై చర్చించారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించగా, అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని ఫోరం ప్రతినిధులు భరోసా కల్పించారు.