మహిళలకు తీపి కబురు: ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించిన విజయ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: చెన్నై
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ మహిళల కోసం ప్రతిష్టాత్మకమైన వెట్రి పయనం పథకానికి శ్రీకారం చుట్టారని అధికారులు తెలిపారు. చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన ఆయన, స్వయంగా బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులకు ఉచిత టికెట్లను అందజేశారు. ఏసీ మినహా అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.