ప్రత్తిపాడులో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ప్రత్తిపాడు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం వద్ద ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాలకు చెందిన పలు కుటుంబాలకు మొత్తం రూ.8,10,478 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.