ఆక్లాండ్ నెట్స్ లో తీవ్ర శ్రమ: కెప్టెన్ శుభ్మన్ గిల్ మారథాన్ ప్రాక్టీస్

రిపోర్టర్: మహేష్ స్థలం: Auckland

భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో సుదీర్ఘ నెట్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నట్లు ఎడెన్ పార్క్ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం విశ్రాంతి తీసుకున్న గిల్, సోమవారం సుమారు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. కేఎల్ రాహుల్ తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన ఆయన, అనంతరం ఫీల్డింగ్ డ్రిల్స్ లో కూడా నిమగ్నమయ్యారు. ఈ ప్రాక్టీస్ సెషన్ లో స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే పర్యవేక్షించారు.