'మహిళ ఆచూకీ కనుగొని అప్పగింత': కొత్తపేట పోలీసుల సేవలు ప్రశంసనీయం
రిపోర్టర్: శివ
స్థలం: Konaseema
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని కొత్తపేట పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అదృశ్యమైన మహిళ ఆచూకీని విజయవంతంగా కనిపెట్టి, ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సకాల స్పందనపై బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.