కారు అద్దం తాకిందని బైక్‌ను వెంబడించి ఢీకొట్టిన డ్రైవర్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మాదాపూర్‌లో కారు అద్దానికి బైక్‌ తాకిందన్న కోపంతో ఓ డ్రైవర్‌ దారుణానికి ఒడిగట్టాడు. బైక్‌ను వెంబడించి కారుతో ఢీకొట్టడంతో దంపతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్పసొసైటీ సమీపంలో జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు ఫణింద్రకుమార్‌ శర్మపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.