వలస ఎమ్మెల్యేలందరిపై హైకోర్టు తీర్పు వర్తింపజేయాలన్న కేటీఆర్

రిపోర్టర్: గోపి స్థలం: Wanaparthy

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదే సూత్రాన్ని పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలందరికీ వర్తింపజేయాలని ఆయన స్పష్టం చేశారు. వనపర్తిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంలో చట్టం తన పని తాను చేయాలని, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిలదీతలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.