సీఎంఆర్ఎల్ ఎక్సాలాజిక్ విచారణపై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ స్పష్టత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Kerala
కేరళలో సీఎంఆర్ఎల్ ఎక్సాలాజిక్ విచారణ మరియు హెలికాప్టర్ల వినియోగంపై వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తీవ్రంగా తిప్పకొట్టారు. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులపై విచారణకు ఈడీ నివేదిక ఆధారంగానే చట్టపరంగా అడుగులు వేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజనాను కాపాడేందుకే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని, నిబంధనల ప్రకారమే హెలికాప్టర్లు, విమానాలను ఉపయోగించామని స్పష్టం చేశారు.