అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు మీడియా సంస్థల మధ్య ముదిరిన వివాదం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు, ప్రముఖ మీడియా సంస్థలైన సీఎన్ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ సంస్థలకు మధ్య వివాదం ముదిరింది. వైట్‌హౌస్‌లోకి అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఈ మూడు సంస్థలు ఫెడరల్ కోర్టులో కేసులు వేశాయి. న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తనపై కొన్ని మీడియా సంస్థలు బాయ్‌కాట్ చేస్తాయన్న ప్రచారంపై వ్యంగ్యంగా స్పందిస్తూ, మీడియా సంస్థలకు పక్షపాత వైఖరిపై చురకలంటించారు.