లండన్ విమానంలో ఐఫోన్ పోగొట్టుకున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

రిపోర్టర్: సురేష్ స్థలం: Mumbai

లండన్ నుంచి ముంబై వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన ఐఫోన్‌ను పొరపాటున మరిచిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, ఇంటికి వెళ్లిన తర్వాత ఫోన్ పోయినట్లు గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో, పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే విమానంలో నుంచి ఫోన్‌ను వెతికి ఆయనకు సురక్షితంగా అందజేశారు.