జన్నారంలో అంగరంగ వైభవంగా మహిళలు నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి వినాయక నగర్ లో మహిళలు బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. వినాయక నగర్ ,రామ్ నగర్, గాంధీనగర్ ,పుట్టి గూడ, అక్క పెళ్లి గూడ తో పాటు పలు గ్రామాల్లో మహిళలు యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు.