బ్యాంకు లోన్ల మంజూరులో కొత్తగా వాతావరణ మార్పుల ముప్పు అంచనా
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
బ్యాంకులో లోన్ మంజూరు చేసేటప్పుడు కేవలం సిబిల్ స్కోర్‌తో పాటు వాతావరణ మార్పుల ముప్పును కూడా పరిగణనలోకి తీసుకునే దిశగా ఫైనాన్స్ ప్రపంచం మారుతోందని సూర్య ప్రకాష్ జోశ్యుల తెలిపారు. భవిష్యత్తులో పరిశ్రమలపై వాతావరణ ప్రభావం ఎలా ఉంటుందనే కోణంలో బ్యాంకర్లు అంచనా వేస్తారని పేర్కొన్నారు. వ్యాపారాల మనుగడను దెబ్బతీసే వాతావరణ ప్రమాదాలను ఆర్థిక నష్టాల్లో భాగం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సరికొత్త నిబంధనలతో రుణగ్రహీతలు తమ భవిష్యత్తును కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రానుందని హెచ్చరించారు.