అమెరికాలో ప్రత్యేకంగా ఏఐ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమెరికా
కృత్రిమ మేధ రంగంలో అమెరికాను ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మలిచేందుకు అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏఐ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఏఐ జార్ నియామకం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ బాధ్యతల కోసం అత్యున్నత ఐక్యూ ఉన్న ప్రతిభావంతులు అర్హులని పేర్కొన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరును మార్చేందుకు ప్రజల నుంచి ఓటింగ్ కోరుతూ వినూత్న సర్వే చేపట్టారు.