గొర్రెల కాపరుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్లో గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు. వృత్తిదారుల భవనంలో మండల అధ్యక్షుడు భీమనగొని బాలరాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

యాభై ఏళ్లు నిండిన పెంపకందారులకు ఐదు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. గుర్తింపు కార్డులు జారీ చేసి, అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.