రైతన్నలకు తీపి కబురు: జిన్నారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రిపోర్టర్: రాజేష్ స్థలం: జిన్నారం

జిన్నారం మున్సిపల్ పరిధిలోని సోలక్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బకాయిపడిన బోనస్ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఈ కార్యక్రమంలో ఆయన డిమాండ్ చేశారు.