స్వేచ్ఛా వాయువులకై సాగిన మహోజ్వల చారిత్రక ఘట్టం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేశారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులంతా ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.