మద్యం సేవించడం మానుకోవాలని మందలించడంతో వ్యక్తి ఆత్మహత్య
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయనగరం
బాడంగి మండలం డొంకినవలస సమీపంలో రోజూ మద్యం తాగి వస్తున్నావని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది అలజంగి గణపతి అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెర్లాం మండలం కూనాయవలసకు చెందిన గణపతి రాజాంలోని జీఎమ్ఆర్ కళాశాల క్యాంటీన్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన గిడ్డంగుల సంస్థ సమీపంలో ఈ దురాఘాతానికి పాల్పడ్డాడని, భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూర్యకుమారి తెలిపారు.