స్వరూప్ నగర్ గోదాములో అగ్నిప్రమాదం, భయంతో దూకి ఆరుగురికి గాయాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఢిల్లీ

దిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న భవనంలో మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు భవనంపై నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 15 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అణచివేశాయి.