'హైదరాబాద్ విమోచన దినోత్సవం': జాతీయ జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘనంగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం, విమోచన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జి. కిషన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. భారత మాత పట్ల భక్తి భావాన్ని చాటుకుంటూ స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని జి. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.