క్రికెట్ ఆట ఏ ఒక్కరిపై ఆధారపడి లేదన్న వీరేంద్ర సెహ్వాగ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
భారత క్రికెట్ ఆట ఏ ఒక్క స్టార్ ఆటగాడిపై ఆధారపడి లేదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు తప్పుకున్నంత మాత్రాన క్రికెట్ వీక్షకుల సంఖ్య తగ్గదని ఆయన తేల్చిచెప్పారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ సమయంలోనూ ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని సెహ్వాగ్ గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ల ద్వారా క్రీడా ప్రసారాలు అందరికీ సులువుగా అందుబాటులోకి వచ్చాయని, అందువల్ల అభిమానుల సంఖ్య మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని ఆయన తెలిపారు.