స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని చంద్రబాబు పిలుపు

రిపోర్టర్: శివ స్థలం: గుంటూరు

మంగళగిరిలో జరిగిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ ముగింపు సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కష్టపడాలని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 1 కోటి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.