ఉరిసిల్లగా మార్చేశారంటూ బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు
రిపోర్టర్: నరేష్
స్థలం: సిరిసిల్ల
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నేతన్నల గడ్డ సిరిసిల్ల అభివృద్ధి చెందకపోగా ఉరిసిల్లగా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిరిసిల్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని కేసీఆర్ కుటుంబ పాలనపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కొల్లగొట్టారని, గల్ఫ్ వలసలను నివారించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.