'ప్రేమ వివాహానికి సహకరించాడని కత్తితో పొడిచి చంపేశారు': లాలాగూడలో యువకుడి హత్య

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూకారాంగేట్ సాయినగర్‌లో పాతకక్షల నేపథ్యంలో బురుగు కార్తీక్ (26) అనే యువకుడిని ఐదుగురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గతంలో ఓ ప్రేమ వివాహానికి కార్తీక్ సహకరించడంతో కక్ష పెంచుకున్న జి. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, గణేష్ మండపం వద్ద కాపుకాసి కత్తితో మెడపై దాడి చేసి పొట్టనబెట్టుకున్నారు. మృతుడి భార్య బురుగు అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గడ్డి మదన్ కుమార్, గడ్డి ప్రవీణ్ కుమార్, గడ్డి సాయి కుమార్, గడ్డి నాగేశ్, గడ్డి నర్సింగ్ రావులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.