కోవూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ.
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరులోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు నూతన విగ్రహాన్ని వారు ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడి సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.