రాజాపేట పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు కరవై వాహనదారుల తీవ్ర ఇక్కట్లు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని పెట్రోల్ బంకుల్లో తాగునీరు మరుగుదొడ్లు ఉచిత గాలి వంటి కనీస వసతులు కరువవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇంధన విక్రయాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న బంకుల నిర్వాహకులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.