కేరళలో ఎక్సైజ్ అధికారుల అవినీతిపై మెరుపు దాడి, ఏడుగురు సస్పెండ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కేరళ

కేరళలో ఎక్సైజ్ కమిషనర్ సీరం సాంబశివరావు రహస్యంగా చేపట్టిన 'ఆపరేషన్ బీజాపూర్' సంచలనం సృష్టించింది. చంగనస్సేరిలో బార్ల నుండి లంచాలు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులతో స్వయంగా రంగంలోకి దిగిన కమిషనర్, అవినీతికి పాల్పడిన ఏడుగురు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. బార్ల నుండి నగదు, మద్యం, ఆహార పదార్థాలను వసూలు చేస్తున్న వ్యవస్థను ఆయన ఛేదించారు. ఈ మెరుపు దాడి ఎక్సైజ్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.