పోలీస్ శాఖలో సేవలు అందించిన అధికారులకు ఎస్పీ వీడ్కోలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్

పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు అంకితభావంతో సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులకు ఎస్పీ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (SP KB Asifabad) ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్ఐ జాడీ శ్యామ్ రావు, ఏఎస్ఐ వేమూరి ప్రభాకర్, ఏఎస్ఐ సంజీవ్ కుమార్ పాల్, ఏఆర్హెచ్సీ ఎం.ఎ. షబీర్లు తమ విధుల్లో చూపిన ప్రతిభ, అందించిన సేవలు పోలీస్ శాఖకు ఎప్పటికీ చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ నితికా పంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి భవిష్యత్తు కొత్త జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.