గ్రూప్-1 ప్రధాన పరీక్షల మూల్యాంకనంపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంపై స్పష్టతనిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. అప్పటి ఛైర్మన్ గౌతం సవాంగ్ విజయవాడలో మాన్యువల్ మూల్యాంకన ప్రతిపాదనను బోర్డు ముందు ఉంచారా లేదా అనే దానిపై వివరాలు తెలపాలని సూచించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన అక్రమాలపై దాఖలైన అప్పీళ్లపై బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణను అక్టోబరు 6కు వాయిదా వేసింది.