పాడి పశువుల సంరక్షణతోనే రైతుల ఆర్థికాభివృద్ధి: మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు
రిపోర్టర్: గోపి
స్థలం: భూదాన్ పోచంపల్లి
పాడి పశువుల సంరక్షణతోనే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. భూదాన్ పోచంపల్లి లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దూడల నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. దూడలకు సకాలంలో మందులు తాగించడం వల్ల ఆరోగ్యంగా ఎదుగుతాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశువైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.