కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడి ఉద్రిక్తత, కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్!
రిపోర్టర్: విజయ్
స్థలం: సిద్దిపేట
కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ రక్షణకు వెళ్తున్న కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు బొల్లారం వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై మండిపడిన కేటీఆర్, కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని తీవ్రంగా హెచ్చరించారు.