ప్రాజెక్ట్ అన్నపూర్ణ ద్వారా పేద కుటుంబాలకు రష్మిక మందన్న భారీ సాయం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
దక్షిణ భారతదేశంలోని ఎనిమిది ప్రాంతాల్లోని నాలుగు వందల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు నటి రష్మిక మందన్న తెలిపారు. ప్రాజెక్ట్ అన్నపూర్ణ పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాల ద్వారా తనకు లభిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు రష్మిక వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.