ది ప్యారడైజ్ సినిమా ప్రీమియర్ టికెట్ రేట్లపై చర్చ

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా ప్రీమియర్ టికెట్ రేట్లు జిఎస్టీతో కలిపి రూ.500 వరకు ఫిక్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రూ.400 ఉంటుందని ప్రచారం జరిగినా, జీవోలో రూ.500 ఉండటంతో చిన్నపాటి షాక్ తగిలింది. అయితే ఇతర పెద్ద హీరోల సినిమాలతో పోలిస్తే ఈ రేట్లు తక్కువేనని మేకర్స్ కవరింగ్ చేస్తున్నప్పటికీ, నాని మార్కెట్ కు ఈ ధరలు ఎక్కువేననే చర్చ నైజాంలో జోరుగా సాగుతోంది.