విజయనగరం జిల్లాలో కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతమైంది. ఈనెల 24 నాటికి పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన 51,722 దరఖాస్తులను సంక్షేమ సహాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి నిబంధనల ప్రకారం అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.