సింగరేణిలో పెండింగ్ సమస్యలపై కదంతొక్కనున్న ఏఐటీయూసీ కార్మిక సైన్యం

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల నాలుగో తేదీన శ్రీరాంపూర్ ఏరియా జిఎం కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా తెలిపారు. సంస్థలో రాజకీయ జోక్యాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.