తీరంలో గస్తీకి త్వరలో అత్యాధునిక హైస్పీడ్ బోటు
రిపోర్టర్: వెంకట్
స్థలం: బిట్రగుంట
మత్స్యకారుల భద్రత కోసం జిల్లా తీరంలో గస్తీకి త్వరలో హైస్పీడ్ బోటు రానుందని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు పేర్కొన్నారు. తమిళనాడులోని నాగపట్నంలో రూ.1.20 కోట్లతో తయారవుతున్న ఈ అత్యాధునిక పడవ తుది మెరుగులు దిద్దుకుంటోందని తెలిపారు. మరో నెల రోజుల్లో ఇది జిల్లాకు చేరుతుందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల హైస్పీడ్ బోట్లు సాగర జలాల్లోకి రాకుండా కట్టడి చేసేందుకు కలెక్టర్ హిమాన్షుశుక్లా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. శక్తిమంతమైన స్టీల్ బాడీ, 650 హార్స్ పవర్ ఇంజిన్తో ఈ బోటు సిద్ధమవుతోంది.