పల్లెర్లలో ఘనంగా గణేష్ నిమజ్జనం అన్నప్రసాద వితరణ చేసిన కమిటీ
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. గణపతి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు, యువకులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.