స్వ ప్రభుత్వంలోనే భారీ దోపిడీ: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ. 3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్-2 నిర్మాణ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తక్కువ ధరకు టెండర్లు వేసిన తమ కంపెనీని పక్కన పెట్టి, ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.