కాళ్లతో రాస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎదిగిన దివ్యాంగుడు!
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాకు చెందిన జామి సింహాచలం నాయుడు పుట్టుకతోనే రెండు చేతులు, ఒక కాళ్ళు లేకపోయినా పట్టుదలతో రాణించారు. పిన్న వయసులోనే కాళ్లతో రాయడం నేర్చుకున్న ఆయన, ఏనాడూ ఇతరుల సహాయం తీసుకోకుండా డిగ్రీ, బి.ఎడ్ పూర్తి చేశారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.