ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం

రిపోర్టర్: సతీష్ స్థలం: Japan

ఆసియా క్రీడల్లో భాగంగా మహిళల హాకీ పూల్ బి మ్యాచ్‌లో భారత జట్టు 20-1 గోల్స్ తేడాతో థాయిలాండ్‌ను చిత్తు చేసింది. స్టార్ ప్లేయర్ దీపిక అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఏడు పెనాల్టీ కార్నర్లు సహా మొత్తం తొమ్మిది గోల్స్‌ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. నవ్‌నీత్ కౌర్ నాలుగు గోల్స్ చేయగా, రుతుజా పిసాల్ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఈ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ టోర్నమెంట్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది.