ఐపీఎల్ 2027: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

ఐపీఎల్ 2027 సీజన్కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్మెంట్ ప్రకటించింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తమ జట్టు కొత్త హెడ్ కోచ్గా నియమించినట్లు వెల్లడించింది. గత రెండు సీజన్లుగా ఈ పదవిలో కొనసాగిన హేమాంగ్ బదానీ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఫ్రాంచైజీతో తనకు బలమైన అనుబంధం ఉందని, జట్టును విజయపథంలో నడిపించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా గంగూలీ పేర్కొన్నారు.