సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలు మరియు హెచ్చరికలు
రిపోర్టర్: గోపి
స్థలం: రియాద్
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌తోపాటు అల్-ఖర్జ్ గవర్నరేట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ దాడుల నేపథ్యంలో రెండోసారి ప్రమాద హెచ్చరికలు జారీకావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే తదనంతరం ప్రమాదం గడిచిపోయిందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని సౌదీ సివిల్ డిఫెన్స్ ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.