థర్మల్ పవర్ ప్లాంట్ల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ను బీఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సందర్శించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పవర్ స్టేషన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అనుమతించలేదు. దీంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పవర్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. మరోవైపు దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని పార్టీ పేర్కొంది.